జార్ఖండ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు. సుజిత్‌ను సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలు నుంచి ధన్‌బాద్ కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించడంతో వారిపైకి కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుజీత్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి.
ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా హతం
الاثنين، 3 أغسطس 2026
Jharkhand Most Wanted Gangster Sujit Sinha Killed in Encounter national transported from Sahibganj Divisional Jail to Dhanbad
ليست هناك تعليقات:
إرسال تعليق