కొండా సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది : బి. మహేష్ కుమార్ గౌడ్

الخميس، 20 أغسطس 2026

Congress Party Strongly Condemns Konda Susmitha's Remarks PCC) President B. Mahesh Kumar Goud show-cause notice had already been issued to Minister Konda Surekha telangana

t f B! P L

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, ఆమె వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. సురేఖ ప్రస్తుతం బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టే ఆమె నుంచి వివరణ కోరాము. ఆమె ఇచ్చే వివరణ అందిన తర్వాత క్రమశిక్షణా కమిటీ తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది అని వెల్లడించారు. పార్టీలో ఎంతటి సీనియర్ నాయకులైనా సరే, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రస్తావన వచ్చిన సందర్భంలోనూ పార్టీ గీత దాటితే ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఉన్న స్పష్టమైన విధానాన్ని పీసీసీ అధ్యక్షులు వివరించారు. పార్టీలో అభ్యర్థులను నిర్ణయించడానికి నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల కమిటీ మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అలా కాకుండా ఎవరైనా సొంతంగా అభ్యర్థులను ప్రకటించినా అవి చెల్లుబాటు కావు అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ