Ad Code

నరేంద్ర మోడీకి ఫోన్ చేసిన బెంజమిన్ నెతన్యాహు : ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడి

జ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోడీకి  ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమగ్రంగా చర్చించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పీఎంఓ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార పురోగతిని మోడీ, నెతన్యాహు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల కోసం రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, ఆవిష్కరణలు, వాణిజ్యం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారు. అదే సమయంలో పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ శాంతి, స్థిరత్వం కోసం పరస్పర సంప్రదింపులు కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇకపై కూడా పరస్పరం నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోడీ, నెతన్యాహు అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu