కొలీజియం నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోంది !

السبت، 1 أغسطس 2026

Lack of Transparency in Collegium Decisions national Speaking at a discussion organized by the think-tank 'Vidhi' in Delhi Supreme Court Judge Justice Ujjal Bhuyan Expresses Concern

t f B! P L

ఢిల్లీలో విధి థింక్-ట్యాంక్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ న్యాయమూర్తులను నియమించే 'కొలీజియం' వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనుక గల కారణాలను బహిరంగపరచకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. అర్హత లేని వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. 'ప్లేటో నుంచి బెంతమ్ వరకు అందరూ చెప్పినట్లు కోర్టులలో ఏం జరుగుతోంది? తమ న్యాయమూర్తులు ఎవరు? వారు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు? అని తెలుసుకునే పూర్తి హక్కు దేశ పౌరులకు ఉంది. ఈ సమాచారమంతా ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2023లో సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేసినప్పుడు కొలీజియం చాలా స్పష్టమైన కారణాలను వెల్లడించింది'. అయితే, సౌరభ్ కిర్పాల్‌ను కొలీజియం సిఫార్సు చేసి మూడేళ్లు గడిచినా ఆయన నియామకం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. కారణాలను వెల్లడించకపోవడం వల్ల సమర్థులైన, నిజాయితీ గల న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుంది. ఎలాంటి అర్హత లేని వ్యక్తులు వ్యవస్థలోకి రావడం వల్ల, వారు భవిష్యత్తులో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఒక వర్గం ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉంది' అని జస్టిస్ భుయాన్ హెచ్చరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ