భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాష్కెంట్ చేరుకున్నారు. ఆయనకి ఉజ్బెక్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, విద్యతో పాటు కీలక ఖనిజ వనరులపై చర్చలు జరుపుతారు. తాష్కెంట్‌లోని భారతీయ సమాజం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికింది. భారతీయుల ప్రదర్శించిన కథక్, అండిజాన్ పోల్కా నృత్యాలతో పాటు ఉజ్బెక్ చిన్నారులు భారతీయ గీతానికి చేసిన నృత్యాన్ని మోడీ వీక్షించారు. తబలాతో పాటు సాంప్రదాయ ఉజ్బెక్ వాయిద్యాలైన డోయిరా, చాంగ్‌ల ఆకర్షణీయమైన సమ్మేళనాన్ని కూడా వీక్షించారు. అనంతరం అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో కలిసి యాంగీ ఉజ్బెకిస్తాన్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ప్రధాని ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి.
ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
الأحد، 30 أغسطس 2026
Grand Welcome for PM Modi in Uzbekistan national performances of Kathak and Andijan Polka dances by Indians Uzbek President Shavkat Mirziyoyev
ليست هناك تعليقات:
إرسال تعليق