మెరికాలోని సౌత్‌ కరోనాలిలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడి కాల్పుల్లో పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరో పోలీస్‌ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. నిందితుడికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన పోలీస్‌ అధికారి రెండు సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఆస్తులను ధ్వంసం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు అధికారి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అనుమానితుడు ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ మహిళ అనుమానితుడి రూపురేఖలు.. అతని వాహనం వివరాలను అధికారికి ఇచ్చింది. అయితే, కొద్ది నిమిషాల తర్వాత, ఆ మహిళ చెప్పిన వివరాలకు సరిపోలే వాహనం సమీపంలో ఒక వ్యక్తిని గమనించారు. దీంతో అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు, నిందితుడికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

Post a Comment

أحدث أقدم