Tuesday, August 11, 2026

విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం : పోలీస్ కాల్పుల్లో గాయపడ్డ నిందితుడు

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో సెక్యూరిటీ గార్డు ఓ విద్యార్థినిని టెర్రస్ పైకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల అదుపు నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆర్.ఎస్. సర్వీస్ రివాల్వర్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. పోలీస్ అధికారి కాల్పులు జరపడంతో నిందితుడితో పాటు మరో కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లా మహురా కలాన్ ప్రాంతానికి చెందిన ధరమ్ సింగ్ అనే వ్యక్తి అహ్మదాబాద్‌లో గత రెండు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో ధరమ్ సింగ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కుచ్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఇంటీరియర్ డిజైన్ నేర్చుకుంటూ అదే అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. టెర్రస్‌పై ఫోన్ మాట్లాడి కిందకు వస్తుండగా సెక్యూరిటీ గార్డు ఆమెపై బలవంతం చేసి పైకి లాకెళ్లాడు. గొంతు చుట్టు వైర్ చుట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం టెర్రస్ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు డోర్ ఓపెన్ చేశారు. జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రికవరీ పంచనామా ప్రక్రియ జరుగుతుండగా, పోలీసుల అదుపు నుండి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎస్. పర్మార్ సర్వీస్ రివాల్వర్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడని అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివం వర్మ మీడియాకు తెలిపారు. మరో పోలీస్ అధికారి కాల్పులు జరపడంతో నిందితుడితో పాటు మరో కానిస్టేబుల్ గాయపడ్డారని వివరించారు. ఇద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు.