చెన్నై ప్రధాన కేంద్రంగా జువెల్లరీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ లలితా జువెల్లరీ మార్ట్ ఐపీఓకు రాబోతుంది. పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ఆగస్ట్ 17న ప్రారంభం కాబోతుంది. ఆగస్ట్ 19 లాస్ట్ డేట్. ఇది బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింట్లో లిస్టింగ్ అవనుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ. 190- 201 గా ఖరారు చేసింది. ఈ ఐపీఓ ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు షేర్లు విక్రయించనుండగా, ఇదే సమయంలో కొత్త షేర్లను కూడా జారీ చేయనున్నారు. షేర్ల ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ కుమార్ ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయించి మరో రూ. 500 కోట్లు ఇలా మొత్తం రూ. 1700 కోట్ల నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పబ్లిక్ ఇష్యూకు ముందు ఒక రోజు యాంకర్ బుక్ బిడ్డింగ్ ఆగస్ట్ 14న అందుబాటులో ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత మదుపరులు ఇక్కడ షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. ఆగస్ట్ 17-19 మధ్య సబ్‌స్క్రిప్షన్ జరిగితే, 20న షేర్ల అలాట్‌మెంట్ ఉండనుంది. మార్కెట్లోకి ఆగస్ట్ 24న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక లలితా జువెల్లరీ మార్ట్ రూ. 6 కోట్ల వరకు విలువైన షేర్లను ఉద్యోగుల కోసం కేటాయించింది. ఇది ఫైనల్ ఇష్యూ ప్రైస్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ ధరలో ఆఫర్ చేస్తుంది. ఒక్కో లాట్ కింద 74 షేర్లను కేటాయించారు. ఈ పబ్లిక్ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఎక్వైరస్ వ్యవహరిస్తున్నాయి.
0 Comments