తెలంగాణలోని జగిత్యాల పట్టణం గాంధీనగర్‌ లో ఆదివారం ఉదయం ఇంటి ముందు ఊడుస్తున్న నక్క నర్సవ్వ పై అల్లుడు కట్ట ప్రశాంత్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నర్సవ్వకు గాయాలు కాగా, వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం జగిత్యాలకు చెందిన కట్ట ప్రశాంత్, అతని భార్య మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదాలు చివరకు విడాకుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవలకు తన అత్త నర్సవ్వే కారణమని ప్రశాంత్ కక్ష పెంచుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఇంటి ముందు ఊడుస్తున్న నర్సవ్వ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم