తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో వివాహేతర సంబంధం వలన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ల అనూష(22) భర్త చెన్నయ్యతో ఆరు సంవత్సరాల క్రితం విహహమైంది. అనూష కల్వకుర్తి పట్టణంలోని ఓ లేడీస్ కార్నర్‌లో పనిచేయగా, భర్త చెన్నయ్య ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇరువురికి ఓ కుమారుడు ఉన్నాడు. అనూషకు వివాహం అయినప్పటికీ అదే గ్రామానికి చెందిన రాముతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బుధవారం రాత్రి అనూషను గ్రామ శివారులోని ఒడ్దనిరాళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఘటన అనంతరం పోలీసులు హత్యకు పాల్పడిన రాములుతోపాటు హత్యకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ఘటనకు గల కారణాలు పరిశీలిస్తున్నారు.
ホーム
/
Veldanda Mandal
/
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం : హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి పరారైన ప్రియుడు
الخميس، 13 أغسطس 2026
and flees Extramarital Affair Leads to Brutal Murder Kotra village Lover Kills Woman Nagarkurnool district Sets Body Ablaze telangana Veldanda Mandal
ليست هناك تعليقات:
إرسال تعليق