అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం జాక్సన్ నగరంలో గురువారం సాయంత్రం జరిగిన దోపిడీ ప్రయత్నంలో గుజరాత్‌కు చెందిన సురేష్ పటేల్ (56) దారుణంగా హత్యకు గురయ్యారు. కుమార్తె కళ్లెదుటే తండ్రిని దుండగుడు కాల్చి చంపడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సురేష్ పటేల్‌కు చెందిన 'రిడ్జ్‌క్రెస్ట్ సెల్లార్స్' అనే లిక్కర్ షాప్‌లోకి మాస్క్ ధరించిన దుండగుడు తుపాకీతో ప్రవేశించి, తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేయగా, షాపులో ఉన్న పటేల్ దొంగకు డబ్బులు అందించారు. అయినా విచక్షణారహితంగా కాల్పులు జరిపిన నిందితుడు పటేల్‌ను అక్కడికక్కడే బలితీసుకున్నాడు. ఈ దారుణ సంఘటన జరుగుతున్న సమయంలో సురేష్ పటేల్ కుమార్తె కూడా ఆయనతోనే షాపులో ఉంది. నిందితుడు గ్రే కలర్ హూడీ, జీన్స్ ధరించి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. దోపిడీ అనంతరం తెల్లటి కారులో పరారైనట్లు జాక్సన్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
అమెరికాలో భారతీయ వ్యాపారిని కాల్చి చంపిన దుండగుడు
الأحد، 23 أغسطس 2026
a native of Gujarat attempted robbery in Jackson Indian Businessman Shot Dead in the US Suresh Patel (56) Tennessee
ليست هناك تعليقات:
إرسال تعليق