శాటిలైట్ ఏఐ జనరేషన్ టూల్ ను 24 గంటల్లోనే వెనక్కి తీసుకున్న గూగుల్

السبت، 1 أغسطس 2026

designed to allow Google Earth users to create AI-generated images based on satellite imagery Google Withdraws Satellite AI Generation Tool Within 24 Hours science technology

t f B! P L

గూగుల్ ప్రవేశ పెట్టిన శాటిలైట్ ఏఐ జనరేషన్ టూల్ ను ప్రవేశ పెట్టిన 24 గంటల్లోనే వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్ ఎర్త్ ను వినియోగించే కస్టమర్స్ శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఏఐ రూపొందించే ఇమేజ్ లను క్రియేట్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ వివాదాస్పదంగా మారటంతో గూగుల్ వెనక్కు తీసుకుంది. ఈ ఫీచర్ వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి అయ్యే ప్రమాదం ఉందని.. పరిశోధకులు, ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేయడంతో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఈ నిర్ణయం తీసుకుంది. గత గురువారం లాంచ్ అయిన క్రియేట్ ఇమేజ్ టూల్.. గూగుల్ నానో బనానా 2 ఇమేజ్-జనరేషన్ టెక్నాలజీ సహకారంతో గూగుల్ ఎర్త్ శాటిలైట్, ఏరియల్, 3D-మ్యాపింగ్ డేటా ఆధారంగా ఎంచుకున్న ప్రదేశాలను జూమ్ చేసి, సెకన్లలో ఇమేజ్ లను రూపొందించడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. లాంచ్ సందర్భంగా గూగుల్ ఎర్త్‌లోని ఒక ప్లేస్ జూమ్ చేసి, క్రియేట్ ఇమేజ్ పై నొక్కి, మీరు చూడాలనుకున్నది టైప్ చేయండి అని ప్రొడక్ట్ మేనేజర్ బ్రయాన్ హోరోవిట్జ్ వెబ్ లో రాశారు. ఆ ఫీచర్‌ను వెనక్కి తీసుకోవడంపై గూగుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రపంచాన్ని మరింత క్లారిటీతో, విశ్వసనీయంగా చూడటానికి ప్రజలు గూగుల్ ఎర్త్‌ను నమ్ముతారని తమకు తెలుసునని చెప్పింది. జియోస్పేషియల్ నిపుణులు ఈ ఫీచర్‌ను అనేక ప్రయోజనాల కోసం వాడటాన్ని చూశాము, అయితే కొత్తగా ప్రవేశ పెట్టిన టూల్ ద్వారా సంస్థ విధానాలను ఉల్లంఘిస్తున్నట్లు కనిపించే ఇమేజెస్ క్రియేట్ అయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. తయారు చేసిన స్క్రీన్‌షాట్‌లను ప్రజలు పంచుకోవడాన్ని గమనించినట్లు తెలిపారు. అందువల్ల, మరింత పటిష్టమైన ప్రైవసీ చర్యలను అమలు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. అందువలన గూగుల్ ఎర్త్‌లో ఈ ఫీచర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఫీచర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఓపెన్-సోర్స్ రీసెచర్చర్ హెంక్ వాన్ ఎస్, Xలో పోస్ట్ చేశారు. మెక్సికన్ సరిహద్దులోని శరణార్థులను, ఇరాన్‌లోని ఒక న్యూక్లియర్ ప్లాంట్ ను, ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఒక విమాన ప్రమాదాన్ని, గాజాలో బాంబులతో భద్రతతో సొరంగంలో ఉన్న ఆసుపత్రిని ఇమేజెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్లు ఆయన చెప్పారు. అన్నింటినీ అంగీకరించినట్లు తెలిపారు. అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఉపగ్రహ చిత్రాల నిపుణుడు బ్రాడీ అఫ్రిక్, AFPతో మాట్లాడుతూ, గూగుల్ ఎర్త్ అప్‌డేట్ ఆన్‌లైన్‌లో వేగంగా వ్యాపించి ప్రజలను తప్పుదోవ పట్టించే.. ఫేక్ ఉపగ్రహ చిత్రాలను సృష్టించడానికి సహకరిస్తుందని అన్నారు. రోజురోజుకూ కామన్ అవుతున్న ఈ AI-సృష్టించిన ఫేక్ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలపై ప్రజల నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చునని.. పాత్రికేయులు, పరిశోధకుల ఉద్యోగాలను మరింత రిస్క్ లో పడేసే ప్రమాదముందని అన్నారు. ఫేక్ ఇమేజెస్: టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ద్వారా ఫోటోరియలిస్టిక్ ఏఐ ఏరియల్ దృశ్యాలను సృష్టించే ఈ టూల్, అసలైన వాటిలాగే కనిపించే ఫేక్ శాటిలైట్ చిత్రాలను తయారు చేయడానికి ఉపయోగపడింది. నియమాల ఉల్లంఘన: ఇరాన్ అణుకేంద్రం లేదా గాజా ఆసుపత్రి బాంబు క్రేటర్స్ వంటి సున్నితమైన ప్రాంతాలపై నకిలీ చిత్రాల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనించినట్లు గూగుల్ తెలిపింది. మరింత బలమైన భద్రతా నిబంధనలు ఏర్పాటు చేసే వరకు గూగుల్ ఎర్త్ కొత్త ఏఐ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ఆల్ఫాబెట్ ప్రకటించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ