2025లో 59 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలవన్మరణం : పది మంది సభ్యులతో కోర్ గ్రూపును ఏర్పాటు

الخميس، 20 أغسطس 2026

10-Member Core Group Formed 59 CRPF Personnel Died by Suicide in 2025 CRPF Director General (DG) will head the core group national

t f B! P L

2025లో సుమారు 59 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ ఆత్మహత్యల పరంపరను అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ సిద్దమైంది. పది మంది సభ్యులతో కోర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపులో సీనియర్ల ఆఫీసర్లు ఉన్నారు. గడిచిన అయిదేళ్లలో అత్యధికంగా 2025లో 59 మంది సిబ్బంది సూసైడ్ చేసుకున్నారు. కోర్ గ్రూపునకు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వం వహించనున్నారు. ప్రతి నెలకు ఒకసారి డీజీ నేతృత్వంలో సమీక్ష జరగనున్నది. సూసైడ్ ఘటనల గురించి సమీక్షించనున్నారు. సీఆర్పీఎఫ్‌లో మొత్తం 3.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. సూసైడ్ చేసుకున్నవారిలో 80 శాతం మంది కానిస్టేబుళ్లే. 77 కేసుల్లో విధుల్లో ఉన్నపుడే సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి వ్యక్తి కేసును కోర్ గ్రూపు క్షుణ్ణంగా పరిశీలించనున్నది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా సంక్షేమ, వైద్య, అడ్మినిస్ట్రేటివ్ చర్యలు చేపట్టనున్నారు. సూసైడ్ కేసుల్లో జరుగుతున్న పరిణామాలను గుర్తించి, రిస్క్ ఫ్యాక్టర్లను పరిశీలించి, దానికి తగిన రీతిలో వ్యవస్థీకృత పరిష్కారాన్ని కోర్ గ్రూపు చూపనున్నది. రిపోర్టింగ్ హెడ్స్‌, సూపర్‌వైజరీ ఆఫీసర్లు కేసు విశ్లేషణ సమయంలో సహకరించనున్నారు. సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు సీఆర్పీఎఫ్ పేర్కొన్నది. సీఆర్పీఎఫ్ సూసైడ్లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు స్వీకరించింది. కేంద్ర హోంశాఖ, సీఆర్పీఎఫ్ డీజీ నుంచి రెండు వారాల్లోగా వివరణ కావాలని కోరింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ