సెంట్రల్ ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన క్రివీ రిహ్ పై రష్యా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. అతిపెద్ద షాపింగ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 14 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. దాడి తీవ్రతకు షాపింగ్ సెంటర్ భవనంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు, కొనుగోలుదారులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. గాయపడిన వారిలో 29 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘాతుకాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. 

Post a Comment

أحدث أقدم