Ad Code

నీట్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌ రేప్‌ !

త్తరప్రదేశ్ లోని చిత్రకూట్ ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన 20 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సన్నద్ధమవుతోంది. ఆమె కొద్ది రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 17 ఏళ్ల మైనర్ ఫ్రెండ్‌ను కలవడానికి చిత్రకూట్‌కు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వారు బైక్‌పై దేవాంగన లోయ వద్ద ఉన్న గుట్టపైకి వెళ్లారు. ఇది గమనించిన కొంతమంది దుండగులు నకిలీ అధికారులు అవతారం ఎత్తారు. వీరిద్దరూ సోషల్ మీడియా రీల్స్ చేసుకుంటుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము అటవీ శాఖ అధికారులమని చెప్పి బెదిరించారు. అబ్బాయిని బెల్టుతో తీవ్రంగా కొట్టి బంధించారు. ఆ తర్వాత యువతిని బలవంతంగా సమీపంలో ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అరిస్తే గుట్టపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. చివరికి అబ్బాయి తప్పించుకొని పోలీసు అత్యవసర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయపడిన అబ్బాయికి ప్రాథమిక చికిత్స అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సిసిటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగాఅనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రయాగ్‌రాజ్ జోన్ అడిషనల్ డీజీ జ్యోతి నారాయణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

Post a Comment

0 Comments

Close Menu