కేతన్ అగర్వాల్ హత్య కేసు : చేతన్ చౌదరిని రహస్యంగా వివాహం చేసుకున్న సియా గోయల్

الخميس، 9 يوليو 2026

Ketan Agarwal Murder Case: Siya Goyal Secretly Married Chetan Chaudhary maharashtra national pune registered their marriage at a local registrar's office in Pune four months ago

t f B! P L

హారాష్ట్ర లోని పుణెలో సంచలనం రేపిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో నిందితురాలు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌధరిని రహస్యంగా పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఫిబ్రవరిలో కేతన్, సియాల నిశ్చితార్థం జరిగినప్పటికీ, నవంబర్లో వివాహం ఖరారైనప్పటికీ, సియాకు అది అస్సలు ఇష్టం లేదట. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. రహస్యంగా జరిగిన ఈ వివాహం విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో సియా, చేతన్ చౌధరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి సియా కాలేజ్ స్నేహితులిద్దరు సాక్షులుగా సంతకాలు కూడా చేశారు. అప్పటి నుంచే కేతన్ ను అడ్డు తొలగించుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు పోలీసులు ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ అయ్యిందా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అలాగే నిందితుల పెళ్లి ఫొటోలను, సాక్ష్యాలను రికవరీ చేయడానికి టెక్నికల్ టీములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిశ్చితార్థమైన వ్యక్తిని కాదని, ప్రియుడిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత కేతన్ ను హత్య చేయడం పుణెలో తీవ్ర సంచలనం రేపింది. సియా గోయల్, చేతన్ చౌధరిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ