వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంచారు. సవరించిన ఈ సరికొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్‌లో రూ. 176 తగ్గింది. ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై రూ. 183.50 తగ్గడంతో, అక్కడ పాత ధర రూ. 3,113.50 నుండి రూ. 2,930 కి చేరింది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో రూ. 176 తగ్గడంతో సిలిండర్ ధర రూ. 3,191 కి లభించనుంది. మిగిలిన నగరాల విషయానికొస్తే.. కోల్‌కతాలో రూ. 174 తగ్గి రూ. 3,081.50 కి, చండీగఢ్‌లో రూ. 181.50 తగ్గి రూ. 2,954.50 కి, అలాగే పాట్నాలో రూ. 173 తగ్గింపుతో రూ. 3,227 కి కొత్త ధరలు చేరాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అదుపులోకి రావడమే ఈ తగ్గింపునకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించడంతో అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడింది. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం చమురు రవాణా సాగే కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఒత్తిడి తగ్గడం కూడా ఈ ధరల ఉపశమనానికి బాగా కలిసివచ్చింది.
తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర : ఈరోజు నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు
الأربعاء، 1 يوليو 2026
Commercial Gas Cylinder Price Reduced national New Rates Effective Today price has dropped by ₹176 stabilization of crude oil prices in the global market
ليست هناك تعليقات:
إرسال تعليق