ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' వేదికగా స్పందించారు. చివరకు, 'భారతీయ విద్యార్థుల గళం' ఆ అహంకారపూరిత పాలన గడపను తాకింది. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి తమ గళాన్ని వినిపించిన లక్షలాది మంది యువతకు ఇది ఒక విజయం. ఇది సత్యం సాధించిన విజయం, ప్రధాని మోడీ మొండితనానికి ఎదురైన పరాజయం. ఈ ప్రభుత్వం అవినీతిమయంగా ఉండటం వల్ల తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఇది ఒక విజయం. విద్యార్థుల ప్రయోజనాల కోసం పార్లమెంటు నుంచి వీధుల వరకు గళమెత్తిన ఐక్య ప్రతిపక్షానికి ఇది ఒక విజయం. ఇప్పుడు మన యువతకు క్షమాపణ చెప్పడం, అలాగే వారిపై లాఠీలు, పెల్లెట్ గన్‌లను ప్రయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రధాని మోడీ వంతు అని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ స్పందిస్తూ "అసమర్థుడు, సున్నితత్వం లేని, అహంకారి అయిన మంత్రి ప్రధాన్ చివరికి రాజీనామా చేయక తప్పలేదు. యువత నుండి నిరంతర ఒత్తిడి కారణంగానే ప్రధానమంత్రి ఆయనకు రాజకీయ అండను నిలిపివేయవలసి వచ్చింది. అన్యాయమైన, అవినీతిమయమైన వ్యవస్థతో పోరాడి విసిగిపోయిన తరానికి ఇది ఒక విజయం; అలాగే, విద్యార్థులతో బలమైన ఐక్యతను మరియు సంఘీభావాన్ని ప్రదర్శించిన ప్రతిపక్షానికి కూడా ఇది ఒక విజయం.. విషయం ఇంతటితో ముగిసిపోలేదు. మా విద్యార్థుల విషయంలో ప్రధానమంత్రి నుంచి మేము ఇంకా క్షమాపణ ఆశిస్తున్నాము. అలాగే, పెల్లెట్ గన్‌ల వినియోగంతో సహా విద్యార్థులపై అకృత్యాలకు పాల్పడిన వారి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
0 Comments