కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం !

الثلاثاء، 7 يوليو 2026

Chief Minister Revanth Reddy Goal is to make ten million women crorepatis inaugurated the newly established 'Balamrutham' plant at Nacharam telangana

t f B! P L

హైదరాబాద్ లోని నాచారంలో సీఎం రేవంత్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలామృతం ఉత్పత్తికి సంబంధించిన ప్యాకింగ్స్‌ను పరిశీలించారు. గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని అది ఈ రోజు అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగిందని సీఎం అన్నారు. సీఎం మాట్లాడుతూ "ఈ రోజు కొత్తగా బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించుకున్నాం. ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. మూడు కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశామని వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించామని పేర్కొన్నారు. 2034 లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నాం ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు.. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం ను తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ