బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిగ్నల్స్, మొబైల్ టవర్లు లేని ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడేందుకు ఈ శాటిలైట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 1,34,166. ఈ ఫోన్ సాంప్రదాయ సెల్యులార్ నెట్‌వర్క్‌లకు బదులుగా ఉపగ్రహాలను ఉపయోగించి పనిచేసేలా అభివృద్ది చేశారు. దీంతో మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో లేని మారుమూల గ్రామాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ శాటిలైట్ మొబైల్ ఫోన్‌ను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. కానీ కొనుగోలు ప్రక్రియ అనేది చాలా కఠినతరంగా ఉంటుంది. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కఠినతరమైన నియంత్రణ ఉంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు టెలికమ్యూనికేషన్ల శాఖ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డాట్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే ఈ ఫోన్ కొనుగోలు చేసి ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ శాటిలైట్ ఫోన్ నేరుగా ఉపగ్రహాలకు అనుసంధానించబడి ఉంటుంది. దీనివల్ల మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా వినియోగదారులు వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో లేదా సాంప్రదాయ టెలికాం మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్త ఉపగ్రహ నెట్‌వర్క్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో ఈ హ్యాండ్‌సెట్‌ను అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్‌ఎల్ చెబుతోంది. ఇది మారుమూల ప్రాంతాలలో ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ను సాధ్యం చేస్తుందని కంపెనీ చెబుతోంది.
ホーム
/
technology
/
బీఎస్ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ విడుదల
الخميس، 9 يوليو 2026
BSNL Launches Satellite Phone business making it highly useful for remote villages where standard mobile connectivity is unavailable national technology
ليست هناك تعليقات:
إرسال تعليق