బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల మైనర్ విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన కంప్యూటర్ టీచర్ స్కూల్ లైబ్రరీలోనే అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు శుక్రవారం స్కూల్‌కు చేరుకుని నిందితుడిని నిలదీయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సదరు విద్యార్థిని ప్రవర్తనలో గత కొన్ని రోజులుగా మార్పులు రావడాన్ని తల్లిదండ్రులు గమనించారు. అనుమానం వచ్చి ఇంట్లో గట్టిగా నిలదీసి ప్రశ్నించగా.. స్కూల్‌లోనే తనపై జరిగిన ఘోరాన్ని బాలిక వివరించింది. దాదాపు రెండు నెలల క్రితం ఆశిష్ కుమార్ అనే కంప్యూటర్ టీచర్ తనను లోబరుచుకుని, బలవంతంగా స్కూల్ లైబ్రరీకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక వాపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆ బాలిక గర్భం దాల్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు, అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. బాలిక చెప్పిన విషయాలు విని దిగ్భ్రాంతికి గురైన బంధువులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని నిందితుడైన ఉపాధ్యాయుడు ఆశిష్ కుమార్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి చేదాటిపోతుండటంతో స్కూల్ యాజమాన్యం జోక్యం చేసుకుని.. డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ధరహరా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిందితుడైన టీచర్‌తో పాటు బాధిత బాలికను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ధరహరా ఎస్‌హెచ్‌ఓ (SHO) సోను కుమార్ తెలిపారు. శనివారం బాధిత కుటుంబం నుంచి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు అందాల్సి ఉందని, ఫిర్యాదు అందిన తర్వాత చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
విద్యార్థినిపై స్కూల్ లైబ్రరీలో టీచర్ అత్యాచారం
السبت، 18 يوليو 2026
bihar national Police intervened after receiving the information Teacher Rapes Student in School Library took the accused teacher into custody
ليست هناك تعليقات:
إرسال تعليق