రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్లు, ఫ్లాట్లు విక్రయించే సమయంలో క్లబ్‌హౌస్‌లు, ఇతర సదుపాయాల పేరిట వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత వాటిని నిర్మించకుండా కాలయాపన చేసే బిల్డర్లకు రేరా గట్టి షాక్ ఇచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న క్లబ్‌హౌస్ వంటి సదుపాయాలను నిర్ణీత లేదా సహేతుకమైన సమయంలోగా నిర్మించి అందుబాటులోకి తేకపోతే, దానికి సంబంధించి కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రుసుమును వారికి వెనక్కి తిరిగి ఇచ్చేయాలని అత్యంత కీలకమైన, ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది. ముంబైకి చెందిన ఒక వినియోగదారుడు 2019 అక్టోబరులోనే తన ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అయితే, బిల్డర్ క్లబ్‌హౌస్ సదుపాయం కల్పిస్తానని చెప్పి ఫ్లాట్ కొనుగోలుదారుడి నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశారు. ఫ్లాట్ ఇచ్చి ఆరేళ్లకు పైగా గడుస్తున్నా క్లబ్‌హౌస్ నిర్మాణం చేపట్టకపోవడంతో బాధితుడు మహారేరాను ఆశ్రయించాడు. బిల్డర్ తన నుంచి డబ్బులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా క్లబ్‌హౌస్ అందుబాటులోకి తేలేదని, మెంబర్‌షిప్ హక్కులు ఇవ్వలేదని, కాబట్టి వడ్డీతో సహా తన డబ్బులు రీఫండ్ ఇప్పించాలని కోరాడు. దీనిపై బిల్డర్ వాదిస్తూ ఇది ఒక పెద్ద రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని, క్లబ్‌హౌస్ అనేది మొత్తం లేఅవుట్‌కు సంబంధించిన ఉమ్మడి సదుపాయమని పేర్కొన్నాడు. బస్ డిపో తరలింపు, ప్రభుత్వ అనుమతుల వల్ల ఆలస్యమైందే తప్ప నిర్మాణం ఆపేయలేదని, ఒప్పందం ప్రకారం పూర్తి కాకపోతే డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపాడు. ఇరు వర్గాల వాదనలు విన్న మహారేరా.. సేల్ అగ్రిమెంట్‌లో క్లబ్‌హౌస్ నిర్మాణానికి నిర్దిష్టమైన ముగింపు తేదీ లేనప్పటికీ, సహేతుకమైన వ్యవధిలో దాన్ని అందుబాటులోకి తేకపోతే వినియోగదారునికి డబ్బులు రీఫండ్ పొందే హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. క్లబ్‌హౌస్ మెంబర్‌షిప్ కోసం వసూలు చేసిన రూ. 5 లక్షలను 60 రోజుల్లోగా సదరు కొనుగోలుదారునికి తిరిగి చెల్లించాలని బిల్డర్‌ను ఆదేశించింది. అయితే, ఒప్పందంలో వడ్డీ లేని రీఫండ్ నిబంధన ఉన్నందున వడ్డీని మినహాయించింది.
క్లబ్‌హౌస్ కట్టకపోతే బిల్డర్లు డబ్బులు తిరిగి ఇవ్వాలి : రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ
الخميس، 30 يوليو 2026
Builders Must Refund Money If Clubhouse Is Not Built business collect substantial sums from consumers for amenities national Real Estate Regulatory Authority
ليست هناك تعليقات:
إرسال تعليق