Ad Code

సిద్ధరామయ్య రాజకీయ సన్యాసం : ఎక్స్ లో సుదీర్ఘ ప్రకటన విడుదల

ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు క్షీణించాయని, అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మండ్య జిల్లా కేఆర్ పేటలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఎక్స్ లో ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయాలపై సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వరుణ నియోజకవర్గం ఓటర్లు డబ్బులు విరాళంగా ఇచ్చి తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నేటి తరం రాజకీయాల్లో ఓట్లు పొందడానికి అభ్యర్థులే ప్రజలకు డబ్బులు పంచాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. విలువలు లేని కలుషిత రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే వారికి గుర్తింపు దక్కట్లేదని సిద్ధరామయ్య చెప్పారు. ప్రస్తుతం సిద్ధరామయ్య వయసు ప్రస్తుతం 79 ఏళ్లు. 2028 ఎన్నికల నాటికి 82 సంవత్సరాలకు చేరుకుంటుంది. వయసు పైబడటంతో పాటు శారీరక దృఢత్వం తగ్గడం వల్ల ఒకప్పటిలా ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ చురుగ్గా సేవ చేయాలంటే శారీరక శక్తి ఎంతో అవసరమని, అందుకే ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా తాము భావించినట్లు స్పష్టం చేశారు. ఇటీవల కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ నిర్ణయానికి కారణమంటూ వస్తున్న ఊహాగానాలకు సిద్ధరామయ్య పరోక్షంగా తెరదించారు. ఈ నిర్ణయం వ్యక్తిగత కారణాల వల్లేనని తాజాగా తేల్చి చెప్పారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కూడా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశానని, మనస్సాక్షి విరుద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. వరుణ నుంచి మరోసారి పోటీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ నిర్ణయం మార్చుకోబోనని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలలోనూ పోటీ చేయబోనని, తన రాజకీయ జీవితంలో ఎన్నికల పోటీ అధ్యాయానికి ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకొని డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించిన కొన్ని వారాలకే ఈ ప్రకటన రావడం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Post a Comment

0 Comments

Close Menu