హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ ప్రాంతంలోని ఒక లాడ్జిలో రేణుక (28) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, అల్వాల్‌కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫారుక్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ నిన్న రాత్రి లాడ్జిలోని రూమ్ నం.1611 బుక్ చేసుకుని అక్కడికి వెళ్లారు. కొంతసేపు బయటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు రేణుక గదిలో ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు తెలిపాడు. అయితే, మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని, హత్యే అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారుక్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని పోలీసులు తెలిపారు.
లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి
الجمعة، 3 يوليو 2026
crime Langer Houz police station in Hyderabad MD Lines area Suspicious Death of Young Woman in Lodge telangana
ليست هناك تعليقات:
إرسال تعليق