తెలంగాణ లోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలు, పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, పాలు తయారీలో ఉపయోగిస్తున్న రసాయన పదార్థాలు, మిక్సింగ్ సామగ్రి, ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఎంతకాలంగా ఈ అక్రమ దందా కొనసాగుతోంది? అనే కోణాల్లో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ పాల ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
الأربعاء، 15 يوليو 2026
caught Shivannagari Sudhakar Goud red-handed while he was manufacturing the artificial milk Medak district Narsapur Mandal Reddypalli village Task Force Police Bust Adulterated Milk Racket telangana
ليست هناك تعليقات:
إرسال تعليق