ఆశ్రమంలో గంజాయి సాగు : పెద్ద మొత్తంలో ఎండు గంజాయి స్వాధీనం

الجمعة، 17 يوليو 2026

Cannabis Cultivation at Ashram: Large Quantity of Dried Cannabis Seized outskirts of Govindaraopet in Yalal Mandal telangana Vikarabad district

t f B! P L

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేట శివారులోని ఆశ్రమంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా టీమ్ ఆశ్రమంపై నిఘా పెట్టి ఇవాళ ఒక్కసారిగా ఆకస్మిక దాడులు నిర్వహించింది. అక్కడ గంజాయి మొక్కలు సాగు చేస్తుండటాన్ని గుర్తించింది. ఈ దాడుల్లో 25 గంజాయి మొక్కలతో పాటు పెద్ద మొత్తంలో ఎండు గంజాయినీ పోలీసులు గుర్తించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై నిజాముద్దీన్, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామీజీ కాకుండా గంజాయి సాగు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, ఈ తనిఖీల్లో రూరల్, టౌన్ సీఐలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, పరమేశ్వర్ పాల్గొన్నారు.  స్వామీజీ నిజస్వరూపం బయటపడడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు భక్తితో అక్కడికి వెళ్లామని, ఇలాంటి దొంగ స్వాములపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ