కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం : ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్

الأحد، 5 يوليو 2026

telangana Visited the Kannepalli pump house We will storm the Kannepalli pump house and switch on the motors: KTR warns the government

t f B! P L

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించి మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందని ఆగ్రహించారు. తన పర్యటనకు వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపై మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు, ఆటంకాలు కల్పించినా చివరికి కన్నెపల్లి వద్దకు చేరుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. పైఎత్తున పారుతున్న గోదావరి నీటి కోసం పోరాటం ఇప్పటిది కాదు. వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగింది. కేసీఆర్ సంకల్పంతో నీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆయన పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సముద్ర మట్టానికి 80 నుంచి 90 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి వంటి ప్రాజెక్టులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ఆనాటి పరిస్థితుల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలను కూడా అడ్డుకున్నారు. మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలతో ఉత్తమ స్థలం ఎంపిక చేశాం. మహారాష్ట్రను ఒప్పించి వేగంగా నిర్మాణం చేశాం. ఈ ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 19 సబ్‌స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే తిరిగి నిర్మించడానికి రూ.400 కోట్లు ఖర్చవుతుంది. అయితే పనులు చేపట్టేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకొచ్చినా 31 నెలలుగా పనుల్లో పురోగతి లేదు. సీడబ్య్లూసీ లెక్కల ప్రకారం ఎంత కరవు వచ్చినప్పటికీ కాళేశ్వరంలో నీరు అందుబాటులో ఉంటుంది. కోదాడ నుంచి మోతే వరకు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. రోజుకు లక్ష క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోయచ్చు. ఎస్ఆర్ఎస్పీని కూడా నింపే బృహత్తర ప్రాజెక్టు ఇది. రూ.94 వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభ కోణం ఎలా జరుగుతుందన్నారు. మేస్త్రీలు లేకనే మేడిగడ్డ బ్యారేజీకి పునర్నిర్మాణం చేపట్టడం లేదా రేవంత్?. పంజాబ్, హర్యానాను తలతన్నెలా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఎవరు చేయలేని పని కేసీఆర్ చేశారు. రైతులు ఎండినా పర్వాలేదు కానీ ప్రాజెక్టును అడ్డంపెట్టుకొని టైమ్ పాస్ చేస్తోంది కాంగ్రెస్. ఈ రాష్ట్రానికి కాళేశ్వరం వరం. 26 జిల్లాలో కరవు పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్, రేవంత్ పాలనలో నీటి సమస్యలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌కు తాగునీటి సమస్యలు వస్తాయని ఆందోళనగా ఉంది. కేసీఆర్‌ను సంప్రదించి భారీ స్థాయిలో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం' అని హెచ్చరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ