Ad Code

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొద్దిసేపటి క్రితం ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించాల్సిందిగా ప్రధాని మోడీ నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు రాష్ట్రపతి ముర్ము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర మంత్రి మండలిని ప్రక్షాళన చేయాలని భావించిన ప్రధాని మోడీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఆయన చూస్తున్న విద్యాశాఖను ప్రధాని మోడీ మరో మంత్రి ప్రహ్లాద్ జోషీకి అప్పగించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది. అందుకో కొత్త మంత్రి ఎంపిక ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu