ఆధార్ కార్డు అథెంటికేషన్ ద్వారా వంద రకాల రవాణా శాఖ సేవలు : పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం

السبت، 11 يوليو 2026

100 Transport Department Services via Aadhaar Authentication Khairatabad RTA Office to Launch Pilot Project telangana Union Ministry of Road Transport and Highways has issued a gazette notification

t f B! P L

వంద రకాల సేవలను ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పొందేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సరికొత్త విధానం ద్వారా పౌరులు తమ ఇళ్ల నుంచే వివిధ రకాల రవాణా సేవలను సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం కలగనుంది. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రవాణా శాఖ దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో వారం రోజుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత, రాబోయే ఒకటి రెండు నెలల్లో ఈ సేవలను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ప్రారంభంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ కమర్షియల్, రవాణా వాహనాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వంద ఆన్‌లైన్ సేవలను డ్రైవింగ్ లైసెన్స్ (21 సేవలు), వాహన రిజిస్ట్రేషన్ (39 సేవలు), పర్మిట్ సేవలు (17 సేవలు), ఈ-చలాన్ (5 సేవలు)తో పాటు కండక్టర్ లైసెన్స్, ఫిట్‌నెస్, వెహికల్ స్క్రాపింగ్ వంటి మొత్తం 9 కేటగిరీలుగా వర్గీకరించింది. ఈ సేవలను పౌరులు పరివాహన్, సారథి, ఈ-చలాన్ పోర్టల్‌ల ద్వారా ఆధార్ అథెంటికేషన్ ఉపయోగించి పొందవచ్చు. ఒకవేళ ఆధార్ లేని పక్షంలో, ఇతర వాలిడ్ ఐడీ గుర్తింపు కార్డులతో నేరుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే, రోడ్డు భద్రతకు నేరుగా ముడిపడి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు , వాహన ఫిట్‌నెస్ తనిఖీలు మాత్రం ఎప్పటిలాగే ఆఫ్‌లైన్ విధానంలోనే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ సరికొత్త డిజిటల్ చొరవ వల్ల ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గడమే కాకుండా, రవాణా సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా మారనున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ