మోటోరోలా జి77 పవర్ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం

الاثنين، 13 يوليو 2026

₹2 000 bank discount and an additional ₹2 000 exchange bonus business Motorola G77 Power Smartphone Sale Begins technology

t f B! P L

మోటోరోలా గత వారం లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటోరోలా జీ 77 పవర్ ఈరోజు మొదటిసారిగా సేల్ ప్రారంభమైంది. మోటోరోలా జి77 పవర్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 25,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై అందించిన భారీ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఈరోజు సేల్ నుంచి రూ. 23,999 ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ రెండు ఆఫర్స్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే ఒకసారి లభిస్తుంది. ఈ ఫోన్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మోటోరోలా కొత్త ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రెబుల్, పాంటోన్ ఫ్యూసియా రెడ్ మరియు పాంటోన్నాటికల్ బ్లూ అనే మూడు సరికొత్త కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) డిస్‌ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అందుకే ఇందులో స్మూత్ స్క్రోలింగ్, బెస్ట్ గేమింగ్ మరియు వీడియోలు చాలా స్మూత్‌ గా కనిపిస్తాయి. ఈ ఫోన్‌ మీడియాటెక్ Dimensity 6400 ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఇందులో యాప్స్ వేగంగా పనిచేస్తాయి మరియు రోజువారీ పనులు సులభంగా నిర్వహించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UI తో వస్తుంది. కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ లో 7000mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే అధిక సమయం నిలిచి ఉంటుంది. అలాగే, 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఈ ఫోన్ బ్యాటరీ త్వరగా రీఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది 5G కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, USB Type-C పోర్ట్, స్టీరియో స్పీకర్ వంటి ఆకట్టుకునే ఇతర ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఎక్కువ సమయం నిలిచి ఉండే బ్యాటరీ బ్యాకప్, మంచి పెర్ఫార్మెన్స్ మరియు ఆకర్షణీయమైన డిస్‌ప్లే కోరుకునే యూజర్లకు మోటరోలా జి77 పవర్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ