బంగాళాఖాతంలో పెను విషాదాన్ని నింపిన రోహింగ్యాల వలస ప్రయాణం : రెండు పడవలు బోల్తా పడి 500 మంది మృతి

الخميس، 16 يوليو 2026

500 Dead After Two Boats Capsize international Myanmar Rohingya Migration Journey Ends in Tragedy in the Bay of Bengal

t f B! P L

యన్మార్ దేశానికి చెందిన మైనారిటీ వర్గమైన రోహింగ్యాల వలస ప్రయాణం బంగాళాఖాతంలో పెను విషాదాన్ని నింపింది. శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో బోల్తాపడడంతో దాదాపు 500 మందికి పైగా మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్, అంతర్జాతీయ వలసల సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి ఈ రెండు పడవలు బయలుదేరాయి. ఈ రెండు పడవల్లో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రోహింగ్యాలే కాకుండా బంగ్లాదేశ్‌లోని శరణార్థుల శిబిరాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గురైన రెండు పడవల్లో ఒకదానిలో దాదాపు 250 మంది ఉండగా బయలుదేరిన కొద్దిసేపటికే అది నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు 280 మందితో ప్రయాణిస్తున్న రెండో పడవ జులై 8వ తేదీన మయన్మార్‌లోని అయేయార్వాడి తీరంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. రెండు పడవల్లోనూ మొత్తం 530 మంది గల్లంతయ్యారు. వారు ప్రాణాలతో బయటపడే ఆశలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రెండు ఘోర పడవ ప్రమాదాల్లో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయ మానవతా సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళను కలిగిస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ