టెక్నో కామన్ 50 అల్ట్రా 5G విడుదల

الجمعة، 17 يوليو 2026

6.78-inch 1.5K 144Hz ProXDR curved AMOLED display technology Tecno Camon 50 Ultra 5G Launched the MediaTek Dimensity 7400 Ultimate processor

t f B! P L

దేశీయ మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ టెక్నో కామన్ 50 అల్ట్రా 5Gను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 6.78 -అంగుళాల 1.5K 144Hz ProXDR కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7400 Ultimate ప్రాసెసర్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6500mAh బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. అలాగే IP69K వరకు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో పాటు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. దీనిలో 6.78 అంగుళాల 1.5K (1208×2644 పిక్సెల్స్) ProXDR కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2800Hz టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 4nm ప్రాసెస్‌పై రూపొందించిన MediaTek Dimensity 7400 Ultimate ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. మెరుగైన పనితీరు, గేమింగ్ అనుభవం కోసం ఈ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP సోనీ LYT-700C ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌తో 4K@30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. దీనికి 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకుపైగా బ్యాటరీ బ్యాకప్ అందుతుందని టెక్నో తెలిపింది. IP66, IP68, IP69, IP69K డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్ లభించాయి. అదనంగా MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఫోన్ మందం 7.75mm మాత్రమే.  ప్రారంభ ధర రూ.39,999గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్‌లో రూ.3,000 కూపన్ డిస్కౌంట్ లభించడంతో ధర రూ.36,999కు లభిస్తుంది. ఈ ఫోన్ సైప్రస్ గ్రీన్, మిస్టి పర్పుల్, నెబుల టైటానియం రంగుల్లో జూలై 21 నుంచి అమెజాన్ ద్వారా విక్రయాలకు అందుబాటులోకి రానుంది. అలాగే 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ