ఈ20కి వ్యతిరేకంగా రేపటి నుంచి ఉద్యమం

الجمعة، 31 يوليو 2026

AAP chief and former Chief Minister Arvind Kejriwal has decided Campaign Against E20 Starts Tomorrow national Poonawalla who led the first grassroots protest regarding the ethanol

t f B! P L

దేశంలో ఇంధన భద్రత పేరుతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ ను తప్పనిసరి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు భారీ ఉద్యమం ప్రారంభం కాబోతోంది. జాతీయ స్ధాయిలో ఈ20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్  నిర్ణయించారు. ఈ మేరకు ఆయన రేపు ఢిల్లీలో ఉద్యమం ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో ఈ20కి వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు చేస్తున్న సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా కూడా పాదయాత్ర, నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. కేంద్రం E20 కార్యక్రమానికి వ్యతిరేకంగా తన జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు రోజు, ఒక ప్రముఖ వ్యక్తి ఈ ఆందోళనలో చేరబోతున్నారని కేజ్రీవాల్ ఇవాళ ప్రకటించారు. ఇథనాల్ మిశ్రమం సమస్యపై జూలై 5న తొలి క్షేత్రస్థాయి నిరసనకు నాయకత్వం వహించిన పూనావాలా, తాను గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని కేజ్రివాల్ గుర్తుచేశారు. రేపు న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగే కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని, పాల్గొనేవారు ఉదయం 11.30 గంటలకల్లా చేరుకోవాలని కేజ్రీవాల్ తెలిపారు.  ఆగస్టు 1న ఈ20కి వ్యతిరేకంగా జాతీయ టౌన్ హాల్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను వినడానికి, E20పై ఒక నిర్ణయం తీసుకోవడానికి దేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి నాతో పాటు ఉంటారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. మీ ఆలోచనలను కూడా పంచుకోవడానికి తప్పకుండా రండి అని ప్రజల్ని కోరారు. వర్చువల్‌గా చేరాలనుకునే వారి కోసం వాట్సాప్ నంబర్‌ను కూడా షేర్ చేశారు. తాజాగా కాక్రోచ్ ల ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను ఈ20 ఉద్యమానికి కేజ్రివాల్ లింక్ చేశారు. దేశ యువత అహంకారపూరిత ప్రభుత్వాన్ని తలవంచేలా చేసిందని, ధర్మేంద్ర ప్రధాన్ ప్రజల ముందు రాజీనామా చేయాల్సి వచ్చిందని కేజ్రీ తెలిపారు. ఇప్పుడు ఈ20 పెట్రోల్ సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానిని కోరారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ