లెనోవో నుంచి ఎల్ఓక్యూ గేమింగ్ మానిటర్, ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల

الأربعاء، 1 يوليو 2026

advanced displays AI-powered features and powerful audio systems business Lenovo Launches LOQ Gaming Monitor Tab Plus Gen 2 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో లెనోవో గేమింగ్ & ఎంటర్‌టైన్మెంట్ విభాగాలను లక్ష్యంగా చేసుకుని లెనోవో ఎల్ఓక్యూ గేమింగ్ మానిటర్ సిరీస్‌తో పాటు కొత్త లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. అధునాతన డిస్‌ప్లే, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో వ్యవస్థతో ఈ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 ట్యాబ్లెట్‌నువినోదం, చదువు, పని వంటి వివిధ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో 12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు Dolby Vision, HDR10 సపోర్ట్ ఉండటంతో వీడియోలు, సినిమాలు, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ఆడియో కోసం JBL రూపొందించిన 9-స్పీకర్ సిస్టమ్‌ను అందించారు. Dolby Atmos టెక్నాలజీతో ఈ స్పీకర్లు శక్తివంతమైన సౌండ్‌ను అందిస్తాయి. సినిమాలు చూడటం, సంగీతం వినడం, గేమింగ్ లేదా వర్చువల్ మీటింగ్‌ల కోసం ఇది అనువుగా ఉంటుంది. ఈ ట్యాబ్లెట్‌లో పలు AI ఆధారిత ఫీచర్లను లెనోవో అందించింది. రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, లెనోవో స్మార్టర్ రీడర్, AI నోట్స్ వంటి టూల్స్ వినియోగదారుల ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఇందులో 360 డిగ్రీలు తిరిగే కిక్‌స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హ్యాంగింగ్ మోడ్, స్టాండ్ మోడ్, థియేటర్ మోడ్, లీన్ మోడ్‌లలో ట్యాబ్లెట్‌ను ఉపయోగించుకోవచ్చు. 10,200mAh సామర్థ్యం గల బ్యాటరీను ఇందులో అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా ఇది మద్దతు ఇస్తుంది. అదనంగా లెనోవో ట్యాబ్ పెన్ ప్లస్, లెనోవో వైర్ లెస్ కీబోర్డు, లెనోవో 68W USB-C చార్జర్ వంటి యాక్సెసరీలకు కూడా సపోర్ట్ ఉంటుంది. గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని లెనోవో ఎల్ఓక్యూ గేమింగ్ మానిటర్ సిరీస్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ ఎల్ఓక్యూ 27Q-10 మోడల్. ఇందులో 27 అంగుళాల QHD IPS డిస్‌ప్లేను అందించారు. 180Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 0.5ms వరకు స్పందన సమయాన్ని అందించడం వల్ల వేగవంతమైన గేమింగ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది. ఎల్ఓక్యూ మానిటర్ సిరీస్‌లో HDR10 సపోర్ట్, 99% NsRGB కలర్ కవరేజ్, AMD ఫ్రీసింక్, VESA అడాప్టివ్ సింక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో గేమింగ్ సమయంలో స్క్రీన్ టియరింగ్, ల్యాగ్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మానిటర్లు ప్లేస్టేషన్ 5, Xbox కన్సోళ్లు, Nintendo స్విచ్ వంటి ప్రస్తుత తరం గేమింగ్ కన్సోళ్లకు కూడా అనుకూలంగా ఉంటాయి. LOQ మానిటర్లలో HDMI 2.1, డిస్ప్లే పోర్ట్ 1.4 కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. అలాగే లెనోవో Artery సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ద్వారా డిస్‌ప్లే సెట్టింగ్‌లు, పనితీరు ఆప్టిమైజేషన్, మానిటర్ మేనేజ్‌మెంట్‌ను సులభంగా నిర్వహించవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ