ఆంధ్రప్రదేశ్ లో 19కు చేరిన కరోనా కేసులు : ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు

الثلاثاء، 21 يوليو 2026

COVID-19 cases in Andhra Pradesh rise to 19 highest number of cases eightwas recorded in the YSR Kadapa district national Omicron RF.5 variant identified

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరాయి. అధికం గా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ తో ఆందోళన అవసరం లేని.. అయితే, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 25 రోజుల్లో కరోనా సోకిన ​బాధితుల్లో నలుగురు మృతి చెందారు. అయితే..వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా తిరిగి కేసులు నమోదు అవుతుండటం, నలుగురు ప్రాణాలు కోల్పోవటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్రంలో గుర్తించిన 19 కేసుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపింది. కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 వేరియంట్‌ను పూణే ల్యాబ్‌లో గుర్తించారు. ఈ వేరియంట్ కు సంబంధించిన లక్షణాలు.. ముందస్తు జాగ్రత్తలను సూచిస్తున్నారు. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో ఆర్ఎఫ్.5 కూడా ఒకటని చెబుతున్నారు. కాలక్రమేణా, కోవిడ్-2 వైరస్ ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందింది. దాని సబ్​ డివిజన్​ JN.1 నుంచి LF.7 , PY.1.1.1 అనే శాఖలు ఉద్భవించాయి. 'RF.5' అనేది ఈ రెండింటి కలయికగా విశ్లేషిస్తున్నారు. ఆర్ఎఫ్.5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్‌ఎఫ్.5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల లక్షణాల మాదిరిగానే ఉంటాయని తెలిపారు. ముఖ్యoగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించటం.. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక.. మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, లేదా గుండె, మూత్రపిండాల వ్యాధులు ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు లక్షణాలు గుర్తించి..మూడు, నాలుగు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే, వారు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ