ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తన నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టడంతో రాజకీయం వేడెక్కింది. దీంతో పోలీసులు ఆయనను అనంతపురం తరలించే ప్రయత్నం చేయగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగి, చివరికి లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని టీడీపీ నాయకులు, తమ కార్యకర్తలపై చేసిన దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.పెద్దారెడ్డిని వాహనంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు సిమెంట్ బెంచీలు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. తర్వాత పెద్దారెడ్డిని ఆయన సొంత నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేసి, చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటి చుట్టూ పోలీసు బలగాలు మోహరించారు. తాడిపత్రి పట్టణంలోని ముఖ్యమైన చోట్లన్నీ పోలీసు భద్రతలో ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఇప్పుడు తమపై దాడులు చేస్తున్నారని నిరసన చేపట్టడం సరికాదని టీడీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పెద్దారెడ్డి నిరసన దీక్షను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. దీక్ష చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకుంటామని టీడీపీ వర్గాలు హెచ్చరించాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతకు కారణం అయ్యింది. ప్రస్తుతం తాడిపత్రి పట్టణం పోలీసు భద్రతలో ఉంది. రెండు పార్టీల మధ్య ఉన్న పోటీ, ఘర్షణలకు దారి తీయకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు.
తాడిపత్రిలో లాఠీఛార్జ్ : పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
الجمعة، 26 يونيو 2026
Andhra Pradesh Lathi-charge in Tadipatri Pedda Reddy Under House Arrest police attempted to move him to Anantapur YCP leaders and activists vehemently obstructed them
ليست هناك تعليقات:
إرسال تعليق