బీజింగ్‌లో భవనాన్ని ఢీకొట్టిన విమానం : సోషల్ మీడియాలో వీడియో వైరల్

الجمعة، 26 يونيو 2026

aircraft disintegrated and debris fell onto cars below Plane Crashes into Building in Beijing Video goes viral on social media

t f B! P L

చైనాలోని బీజింగ్‌లో అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టింది. దీంతో విమానం ముక్కలై కింద కార్లపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రాథమిక వివరాల ప్రకారం ఒక చిన్న విమానం తన నిర్దేశిత విమాన మార్గం నుంచి తప్పిపోయి బీజింగ్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని ఢీకొట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల ప్రకారం.. సన్‌వర్డ్ SA 60L ఆరోరా లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ (రిజిస్ట్రేషన్ B-12PP) ఈ ప్రమాదానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. వైరల్ వీడియోల్లో సుమారు 1,700 అడుగుల ఎత్తు ఉన్న చైనా జున్ భవనం నుంచి విమాన శకలాలు కింద పడిపోతుండగా.. భవనం అడుగు భాగం దగ్గర దట్టమైన పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే ఘటనాస్థలంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడినట్లు కనిపించింది. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు లేదా గాయపడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. మృతులు, గాయపడిన వారి సంఖ్యపై కూడా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేదని సంబంధిత మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ