హారాష్ట్రలోని  పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసులో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్ సోదరుడు పోలీసులు తాజాగా రంగంలోకి దించారు. విచారణకు హాజరైన అతడిని పోలీసులు దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత రాత్రికి పంపించివేశారు. పోలీసుల విచారణలో సాహిల్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తన సోదరి సియా గోయల్‌కు కేతన్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయి ఉంటే, ఆ విషయాన్ని తమ కుటుంబంలో ఎవరికైనా ఒక్క మాట చెప్పి ఉన్నా పెళ్లిని రద్దు చేసేవాళ్లమని సాహిల్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే సియా ఈ దారుణానికి ఒడిగట్టిందని నిందితుడు చేతన్ చౌదరి చెబుతున్న వాదనల నేపథ్యంలో, సోదరుడి స్టేట్‌మెంట్ కీలక మలుపుగా మారింది. 10 గంటల సుదీర్ఘ విచారణలో పోలీసులు సాహిల్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. సియా గోయల్‌కు, ఆమె ప్రియుడైన చేతన్ చౌదరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వారికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? జూన్ 18న లోహగడ్ కోట వద్ద హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీశారు. నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో ఎంతో వైభవంగా జరగాల్సిన పెళ్లి ఇష్టం లేకే, వీరిద్దరూ ముందే పథకం ప్రకారం ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు.

Post a Comment

أحدث أقدم