దేశీయ మార్కెట్లో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా తన ప్రీమియం కూపే-SUV BMW X6 ఫేస్‌లిఫ్ట్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ లగ్జరీ SUV M60i xDrive వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.78 కోట్లుగా నిర్ణయించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి రూపంలో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నారు. BMW X6లో 4.4 లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. దీనికి 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడా జత చేశారు. ఈ ఇంజిన్… 530hp గరిష్ట పవర్, 750Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పాటు xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు. ఈ లగ్జరీ SUV 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 250 కిలోమీటర్లు/గంటకు. అత్యుత్తమ పనితీరు కోసం… అడాప్టివ్ సస్పెన్షన్, రియర్-వీల్ స్టీరింగ్, లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్, xDrive AWD సిస్టమ్ వంటి అధునాతన డ్రైవింగ్ టెక్నాలజీలను కూడా అందించారు. ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో BMW అనేక డిజైన్ మార్పులు చేసింది. వాటిలో… అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ORVMలు, 21-అంగుళాల M-స్పెక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రన్-ఫ్లాట్ టైర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. 14.9-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, Curved Display, Head-Up Display (HUD), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
إرسال تعليق