బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో పెళ్లికి నిరాకరించిందని యువతిని ప్రేమోన్మాది కత్తితో గొంతుకోసి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంజలి(23) అనే యువతి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా రాజీవ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారడంతో గత నాలుగు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని పలుమార్లు అంజలిని అడిగాడు. అతడికి గతంలో నేర చరిత్ర ఉందని అంజలి కుటుంబ సభ్యులకు తెలియడంతో ప్రియుడి నుంచి ఆమె దూరంగా ఉంటుంది. తనని ప్రేమించి పెళ్లి చేసుకోవడంలేదని యువతిపై యువకుడు కక్ష పెంచుకున్నాడు. అంజలిని కలిసి తనతో రావాలని కోరాడు. ఇద్దరు కలిసి మహాలక్ష్మి లేఔట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ కూడా అంజలిని పెళ్లి చేసుకోవాలని రాజీవ్ కోరాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని ఆమె గొంతులో పొడిచాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికి నిరాకరించిందని యువతిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది
الثلاثاء، 30 يونيو 2026
Bengaluru crime deep romantic relationship that lasted for four years karnataka Mahalakshmi Layout Obsessed lover slits woman's throat after she refuses marriage
ليست هناك تعليقات:
إرسال تعليق