దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు ? యూపీఐతో పాటు ఏటీఎంలను వినియోగిస్తున్న ప్రజలు

الجمعة، 5 يونيو 2026

Are ATMs across the country set to shut down? business national People continue to use ATMs alongside UPI technology

t f B! P L


యూపీఐ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏటీఎంలను వినియోగిస్తున్నారు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకుంటున్నారు. క్యాష్ అవసరమైనప్పుడు వెంటనే దగ్గల్లోని ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా ఏటీఎం లావాదేవీలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి.  ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుంది. ఆపరేటర్లు ఏటీఎంలో నగదు నింపడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నగదు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏటీఎంలలో నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా, భద్రత, నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, సిబ్బంది వేతనాలు పెరగడంతో ఏటీఎంలో నగదు నింపేందుకు ఎక్కువ ఖర్చవుతుంది. ఏటీఎంలను వాడటం కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల ఆపరేటర్లకు ఆదాయం తగ్గుతుండగా.. నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడవచ్చని కాన్పెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ హెచ్చరించింది. ఏటీఎంలకు నగదు రవాణా చేసే సంస్థలు, ఆపరేటర్లకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఏటీఎంలలో నింపే నగదులో భారీగా తగ్గుదల నమోదవుతున్నట్లు ఈ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది క్యాట్మీ నివేదిక ప్రకారం మార్చి, ఏప్రిల్‌లో ఏటీఎంలలో నగదు కోసం రూ.94 వేల కోట్లు అవసరమయ్యాయి. మార్చిలో రూ.61 వేల కోట్లు అందుబాటులో ఉండగా ఏప్రిల్‌లో రూ.54 వేల కోట్లు ఉన్నాయి. ఇక ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు క్మాట్మీ ఈ వివరాలు సమర్పించింది. ఇందులో ఏటీఎం ఆపరేటర్లు మార్చిలో తమ నగదు అవసరాల్లో 64 శాతం మాత్రమే పొందారు. ఏప్రిల్‌లో తమ నగదు అవసరాల్లో 57 శాతం మాత్రమే పొందారు. నగదు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏటీఎంలో నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల రానున్న రోజుల్లో ఏటీఎంలు మూతపడే పరిస్థితి కూడా రావొచ్చని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నారు. నగదు నింపడంలో ఇబ్బందుల వల్ల ఏటీఎం సేవలు బంద్ అయ్యే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ