విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ల్యాడిల్ నుంచి హాట్ మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో భారీ పేలుడు జరిగి పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు మీద పడటంతో కొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఈ ఘటన జరిగింది. 8 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.  సాధారణంగానే ఘటనా స్థలంలో చాలా వేడిగా ఉంటుంది. అలాంటి చోట హాట్ మెటల్ అంటే.. 1000 డిగ్రీల వేయి ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి ప్రమాదం స్టీల్‌ప్లాంట్‌లో జరగలేదు. ఇదే తొలిసారి అంటున్నారు. ఇందులో రా మెటిరీయల్‌ని వేడి చేసి.. ద్రవ ఉక్కుగా మార్చుతారు. ఆ తర్వాత ఆ ఉక్కును వస్తువుల తయారీకి వాడతారు. ఐతే.. ఇలాంటి చోట.. లాడెల్ పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. సడెన్‌గా అది పడిపోవడంతో.. ద్రవ ఉక్కు చింది.. భారీ క్రేన్ కాలిపోయింది. మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కార్మికులు హాట్ మెటల్‌లో చిక్కుకుపోయారు. 4 అంబులెన్సుల్లో గాయపడిన వారిని.. స్టీల్‌ప్లాంట్ లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి విశాఖలోని ఇతర ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

Post a Comment

أحدث أقدم