దేశంలో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం : భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

الجمعة، 12 يونيو 2026

national RBI has revealed that retail inflation in the country rose to 3.93 percent in May Rise in Retail Inflation Sharp Increase in Prices of Essential Commodities

t f B! P L

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని మే నెలలో అది 3.93 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టం చేసింది. 4 శాతం అంచనా వేయగా అది 3.93శాతంగానే ఉన్నట్లు చెబుతోంది. మే నెలలో ఆహార, నిత్యావసరాల ధరలు పెరగటానికి కారణం లేకపోలేదు. మే నెలలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. దీని ప్రభావం ధరలపై పడినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. మే నెలలో ధరలు పెరిగిన వాటిలో టమాటా, అల్లం, ఎండు ద్రాక్ష , పాలు, కూరగాయలు, పండ్లు, అంజీరాతోపాటు లోహ ఆభరణాలు ఉన్నాయి. మే నెలలో తగ్గిన ధరల లిస్ట్ చూస్తే బంగాళాదుంపలు, బఠానీ, జీల కర్ర, మోటార్ సైకిల్స్, స్కూటర్లు వంటివి ఉన్నాయి. ఇప్పటికే పెరిగిన ముడి సరుకుల ధరలతోపాటు మే నెలలో పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ 8.4 శాతం ధరలు పెరగటం వల్ల రిటైల్ మార్కెట్ లో ఆహార, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని ఆర్బీఐ స్పష్టం చేస్తుంది. 2026 ఏప్రిల్ నెలతో పోల్చితే.. మే నెలలో ధరలు పెరగటం మధ్య తరగతి, పేద కుటుంబాలపై అధిక భారం పడింది. పొదుపు చేసిన డబ్బులు పెరిగిన ధరలకే సరిపోతుంది అనేది వారి ఆవేదన. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు పాల ధరలు, కిరాణా షాపుల్లో నిత్యావసరాల ధరలు పెరగటంతో పొదుపు చేసే సొమ్ము తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. బియ్యం, ఉప్పు, పప్పులు, వంట నూనెల ధరలు మరింత పెరగటం అనేది సామాన్యుడికి భారంగా మారింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ