అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో కీలక ఎలక్ట్రానిక్ ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న పిటిషనర్ల ఆందోళనపై సుప్రీంకోర్టు తక్షణ విచారణకు నిరాకరించింది. వేసవి సెలవుల కాలంలో ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సెలవులు ముగిసిన తర్వాతే ఈ కేసును విచారిస్తామని, తర్వాత విచారించినంత మాత్రాన 'ఆకాశం మీదేమీ పడదు' అని జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, డేటా రికార్డులు (DVR), క్యూఆర్ కోడ్ లాగ్‌లు మరియు నిధుల డిజిటల్ లెడ్జర్లను మార్చే అవకాశం ఉందని న్యాయవాది ఎన్.కె. గోస్వామి వాదించారు. సాధారణ రాతి శాసనాల తరహాలో కాకుండా, డిజిటల్ సాక్ష్యాలు చాలా తేలికగా తారుమారు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వాయిదాలు పడుతున్న కొద్దీ సాంకేతిక ఆధారాలు శాశ్వతంగా తొలగించబడడమో లేదా మార్చబడడమో జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సుప్రీంకోర్టు అత్యవసరణ విచారణకు నిరాకరించింది. గతంలో అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు లాయర్లు అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగంపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపించాలని కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా ఎన్.కె. గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లో, దేవునికి భక్తులు సమర్పించే కానుకలు ఒక పవిత్రమైన ట్రస్ట్ ఆస్తిగా భావించాలని, వాటిని దుర్వినియోగం కాకుండా సంరక్షించే బాధ్యత అధికారులపై ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్‌లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు లభించిన విలువైన కానుకలు మరియు నగదుపై తక్షణమే స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు అయోధ్య, మథుర వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో విరాళాల లెక్కింపు., భద్రత కోసం ఒక ప్రత్యేక జాతీయ స్థాయి పారదర్శక విధానాన్ని ఏర్పాటు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 2025 అక్టోబర్ నెలలో గురువాయూర్ దేవస్థానం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మైలురాయి లాంటి తీర్పును పిటిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. భక్తులు సమర్పించే ప్రతి పైసా తక్షణమే భగవంతుడి సొంత ఆస్తిగా మారుతుందని, నిర్వాహకులు కేవలం ఒక విశ్వసనీయ సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుందని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఈ ప్రాతిపదికన ఆలయ ప్రాంగణాల్లో నిధుల నిర్వహణ నిరంతరం నిఘా నీడలో జరగాలని న్యాయవాది కోర్టును కోరారు. అయితే కోర్టు వేసవి సెలవులు పూర్తి కాగానే జులై 12 తర్వాతే ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగే వీలుంది. పిటిషనర్ లేవనెత్తిన సాంకేతిక భద్రత మరియు ఆధారాల పరిరక్షణపై కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. అప్పటివరకు ఈ విరాళాల పరిరక్షణ అంశం అటు న్యాయవర్గాల్లోనూ ఇటు భక్తకోటిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా కొనసాగనుంది.
అయోధ్య విరాళాల వివాదం : తక్షణ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
الاثنين، 29 يونيو 2026
Ayodhya Donations Controversy national Supreme Court Refuses Immediate Hearing uttarapradesh vacation bench led by Justice M.M. Sundresh
ليست هناك تعليقات:
إرسال تعليق