ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ మెరుపు దాడుల్లో పిల్లలు, వృద్ధులతో సహా 35 మందికి పైగా పౌరులు మరణించారని ఆఫ్ఘన్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు పాక్ ప్రకటించింది. ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా అటాక్స్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడుల్లో 29 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు తెలిపింది. ఆప్ఘాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేశామన్న పాక్ ఆరోపణలను ఆప్ఘాన్ తీవ్రంగా ఖండించింది. మానవ నివాస ప్రాంతాలపై పాక్ వైమానిక దళం దాడులు జరిపిందని.. బాధితులు ఉగ్రవాదులు కాదు సాధారణ పౌరులేనని పేర్కొంది. పక్తికా ప్రావిన్స్‌లోని జ్ఞాన్, పక్తియా ప్రావిన్స్‌లోని చమ్కానీ, కునార్ ప్రావిన్స్‌లోని మరవారా జిల్లాలలో ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇళ్లు, మసీదులు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించింది. పాక్ బాంబు దాడులలో 36 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించిన పాకిస్తాన్ వైమానిక దళం
الاثنين، 29 يونيو 2026
attacks reportedly took place in the Giyan district of Paktika province international Pakistan Air Force Unleashes Bombardment Along Afghan Border
ليست هناك تعليقات:
إرسال تعليق