Ad Code

మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ

ధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్. ఈ మూడింటిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె నామినేషన్‌ను ఈసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఆ స్థానం బీజేపీకి దక్కింది. నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో మూడు స్థానాలకు ముగ్గురు బీజేపీ అభ్యర్తులు మాత్రమే మిగిలారు. దీంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈసీ ప్రకటించింది. వారికి నియామక పత్రాల్ని కూడా ఈసీ అందించింది. నిజానికి ఈ ఎన్నిక ఈ నెల 18న జరగాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ అభ్యర్తి మీనాక్షి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. తెలంగాణలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఆమె వివరాలు పేర్కొనలేదని చెబుతూ మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించింది. ఈ విషయంపై బీజేపీ తగిన ఆధారాల్ని ఈసీకి సమర్పించింది. వాటిని పరిశీలించిన ఈసీ.. మీనాక్షి అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయని భావించి, ఆమె నామినేషన్‌ రద్దు చేసింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీ, ఈసీ కలిసి కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్తానాన్ని ఆశ్రయించింది. 12వ తేదీన సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

Post a Comment

0 Comments

Close Menu