ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ 'ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి' అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది.
ఇండియా కూటమిలో చీలిక ఉందని అనకండి, కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి : సంజయ్ రౌత్
السبت، 6 يونيو 2026
Don't say there is a rift in the INDIA alliance INDIA alliance meeting scheduled for the 8th in Delhi national Sanjay Raut say the alliance has found an alternative ally
ليست هناك تعليقات:
إرسال تعليق