కరూర్ తొక్కిసలాట బాధితులను కలిసేందుకు ముఖ్యమంత్రి విజయ్ సిద్దమయ్యారు. ఇందులో భాగంగా విజయ్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో వారంలో కరూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల జరిగిన ప్రసంగంలో కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన 2025 సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన టీవీకే సభ సందర్భంగా చోటుచేసుకుంది. నాడు సభ కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారు. విచారణలో సభా నిర్వహణలో లోపాలు, జనసమూహ నియంత్రణలో వైఫల్యాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌ను కూడా సీబీఐ విచారించింది. ఇటీవల అసెంబ్లీలో ఆయన ఈ విషాదాన్ని ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు.
కరూర్ తొక్కిసలాట బాధితులను కలవనున్న ముఖ్యమంత్రి విజయ్
الاثنين، 29 يونيو 2026
Chief Minister Vijay to Meet Karur Stampede Victims he will undertake a visit to offer solace to the affected families scheduled for the second week of July tamilnadu
ليست هناك تعليقات:
إرسال تعليق