ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ దారుణ హత్య ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో జరిగిన ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే చేధించారు. ఇంట్లోకి ఎలాంటి బలవంతపు ప్రవేశం లేకపోవడంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక దంపతులు ఒక పాత ఆస్తి వివాదం కారణంగా దేబోస్మితాను హతమార్చాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం వారు తమ చిన్నారితో కలిసి బెంగాల్ నుండి ఢిల్లీకి వచ్చారు. జూన్ 3న సదరు భార్యాభర్తలు మాస్కులు ధరించి దేబోస్మితా ఉంటున్న ‘సత్యం అపార్ట్మెంట్స్’ ఫ్లాట్‌కు వెళ్లారు. చిన్నారిని బయటే ఉంచి, లోపలికి వెళ్లి ఆమె తలపై బరువైన వస్తువుతో బలంగా కొట్టారు. ఆపై మణికట్టు నరాలు కోసి, ఫ్లాట్‌కు బయట నుండి తాళం వేసి పారిపోయారు.