Ad Code

హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌కి పడుతుంది : మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....?, కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని అన్నారు. పేదలను ఊచకోత కోసిన హిట్లర్ లాగే రేవంత్‌రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. హిట్లర్‌కు పట్టిన గతే ఆయనకూ పడుతుందని హరీశ్‌రావు ఆగ్రహించారు. హిట్లర్‌ను తరిమినట్లే ప్రజలు రేవంత్‌రెడ్డిని కూడా తరుముతారని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాపాలకు కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెబుతూనే ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు, భూమికి గౌరవం లేదని చెప్పుకొచ్చారు. రైతులు ఓటేయకపోతే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Post a Comment

0 Comments

Close Menu